న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత 24 గంటల్లో 46,232 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 90 లక్షల 50వేలు దాటింది. అదే సమయంలో కరోనా కారణంగా 564 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,32,726కు చేరుకుందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 84.78,124కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.67 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,39,747గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.86 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.47గా ఉంది. (కరోనా కేసుల కన్నా డిశ్చార్జ్‌లే ఎక్కువ..)
Comments
Please login to add a commentAdd a comment