
బనశంకరి: కర్ణాటక వ్యవసాయ శాఖా మంత్రి బీసీ పాటిల్‌కు, ఆయన భార్యకు వారి నివాసంలో తాలూకా ఆస్పత్రి సిబ్బంది కరోనా టీకా వేసిన ఉదంతానికి సంబంధించి వైద్యాధికారిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు..మంత్రి బీసీ పాటిల్ హావేరిలో నివాసం ఉంటున్నారు. మార్చి 2న హిరేకెరూరు తాలూకా వైద్యాధికారి జెడ్.ఆర్.మకాందార్ సూచనల మేరకు తాలూకా ఆస్పత్రి సిబ్బంది కరోనా వ్యాక్సిన్ కిట్‌ను తీసుకొని మంత్రి ఇంటికి తీసుకెళ్లి మంత్రితోపాటు ఆయన భార్యకు టీకా వేశారు.
అయితే ఇది కోవిడ్ మార్గదర్శకాలకు వ్యతిరేకమని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో హిరేకెరూరు తాలూకా వైద్యాధికారి జెడ్.ఆర్.మకాందార్‌ను సస్పెండ్ చేస్తూ భారతీయ ఆరోగ్య సేవా కమిషనర్ కేవీ.త్రిలోక్‌చంద్ర శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment