యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా అత్యంత వేడుకగా జరుగుతోంది. కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మహాకుంభమేళాలో మరిన్ని సన్నాహాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.
కుంభమేళాకు రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారని, దీనితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే జరగనుందని సీఎం మీడియాకు తెలిపారు.
రాబోయే గణతంత్ర దినోత్సవం, మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా మహాకుంభమేళా ప్రాంతంలో జనసమూహ నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరచడపై సీఎం అధికారులకు మార్గనిర్దేశం చేశారు. మౌని అమావాస్య, వసంత పంచమి సందర్భంగా అమృత స్నానాల సమయంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. రద్దీ నిర్వహణ దృష్ట్యా, ఈ ప్రత్యేక రోజులలో పాంటూన్ వంతెనపై ట్రాఫిక్‌ను వన్-వేగా ఉంచాలని అధికారులకు తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన సీఎం యోగి మహా కుంభ్ ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం అధికారులతో జరిగిన సమావేశంలో పలు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే
Comments
Please login to add a commentAdd a comment