న్యూఢిల్లీ: రెండవ ప్రపంచ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికులలో 'సుబేదార్ థాన్సేయా' ఒకరు. మిజోరంకు చెందిన మాజీ సైనికుడు థాన్సేయా 102 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు.
యుద్ధంలో అనుభవజ్ఞుడైన సుబేదార్ థాన్సేయా బలీయమైన అసమానతలకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా జరిగిన కొహిమా యుద్ధంలో ప్రదర్శించిన అతని తెగువ.. మిత్రరాజ్యా దళాల విజయానికి కీలక పాత్ర పోషించారు. భారత ఆర్మీ చరిత్రలో విజయ చిహ్నంగా ఆయన మిలిగిపోతారని సీనియర్ ఆర్మీ అధికారి అన్నారు.
సుబేదార్ థాన్సేయా పదవీ విరమణ పొందిన తర్వాత.. కూడా సమాజం, దేశం పట్ల అమితమైన అంకిత భావాన్ని ప్రదర్శించారు. తన అనుభవాలను తెలియజేయడంతోపాటు, విద్య, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన చురుకుగా పాల్గొంటూ.. యువ తరాలలో దేశభక్తి పెంపొందించారని అధికారులు వెల్లడించింది.
సుబేదార్ థాన్సేయాకు నివాళులర్పించదానికి ఆర్మీ మాత్రమే కాకుండా ఆయనను అభిమానించే చాలామంది తరలి వచ్చారు. మన దేశానికి ఆయన చేసిన కృషి, రెండవ ప్రపంచ యుద్ధంలో అతని పాత్ర అనన్య సామాన్యమని పలువురు కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment