ప్రజాపాలన విజయోత్సవం
రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికావొస్తున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్‌లో గురువారం సంబురాలు నిర్వహించా రు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలనుచాటే ప్రదర్శనలతోపాటు ప్రభుత్వ పథకాలను కళాత్మకంగా ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడారు. ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం మహిళల కు ఉచిత బస్సు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోందని వివరించారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఇన్‌చార్జి డీఆర్వో రత్నకళ్యాణి, డీపీఆర్‌వో విష్ణువర్ధన్, గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమన్ అలీ, నిర్మల్, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్లు గండ్రత్ ఈశ్వర్, సత్య, సారంగాపూర్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్లు అబ్దుల్‌హాది, ఆనంద్‌రావ్‌పటేల్ తదితరులు పాల్గొన్నారు. – (నిర్మల్‌చైన్‌గేట్)
Comments
Please login to add a commentAdd a comment