● ఎస్పీ జానకీ షర్మిల ● భైంసా రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ
భైంసారూరల్: నేరాలు తగ్గించేలా పోలీసులు సమన్వయంతో విధులు నిర్వహిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించాలని ఎస్పీ జానకీషర్మిల సూచించారు. భైంసారూరల్ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం తనిఖీచేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంతాలను, వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న కేసు వివరాలను, స్టేషన్ రికార్డులను తనిఖీచేశారు. ప్రజా ఫిర్యాదుల్లో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. నారీశక్తి కార్యక్రమంలో పాల్గొనే మహిళా కానిస్టేబుళ్ల విధుల గురించి ఆరాతీశారు. పోలీస్ అక్కలో పాల్గొన్న మహిళా సిబ్బందితో మాట్లాడి వారు వెళ్తున్న పాఠశాలల వివరాలు అడిగారు. బ్లూకోల్ట్, పెట్రోకార్ డ్యూటీలో ఉన్నప్పుడు 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి సంఘటన స్థలానికిచేరుకుని సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్నారు. పెట్రోలింగ్ సమయాల్లో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లను తనిఖీ చేయాలన్నారు. ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవా ణా పై ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి తాగే వారిని, వారికి సరఫరాచేసే వారిని గుర్తించి కేసులు నమోదుచేయాలన్నారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో సిబ్బందితో కలిసి మొక్కలునాటారు. ఏఎస్పీ అవినాశ్‌కుమార్, సీఐ నైలు, కుభీర్, కుంటాల ఎస్సైలు రవీందర్, భాస్కరాచారి, పోలీసులు ఉన్నారు.