
సహజ వ్యవసాయం చేయాలి
నిజామాబాద్‌అర్బన్: రైతులు క్రమక్రమంగా సేంద్రి య, సహజ వ్యవసాయం చేయాలని ఉద్యానవన శాఖ మాజీ సంచాలకులు వెంకట్రామిరెడ్డి అన్నా రు. రాష్ట్ర ఉద్యానవనశాఖ సమన్వయంతో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని సేంద్రియ, సహజ వ్యవసాయ ప్రాంతీయ కేంద్రం(నాగ్‌పూర్) కలెక్టరేట్‌లో సోమవారం ఒక రోజు శిక్షణ ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకట్రామిరెడ్డి మాట్లా డుతూ.. ఇంత మంచి శిక్షణకు నిజామాబాద్‌వేదిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శిక్షణ పొందిన రైతులు సహజ వ్యవసాయాన్ని అవలంబించాలన్నారు. త్వరలో ఏర్పాటయ్యే జిల్లా ఫార్మర్ ప్రొడ్యుసర్ ఆర్గనైజేషన్(ఎఫ్‌పీవో)లో రైతులు సభ్య త్వం తీసుకోవాలని సూచించారు. జిల్లా రైతులను ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి పర్చాలన్నారు.
సేంద్రియ, సహజ వ్యవసాయం చేసే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, లాభాలను ప్రాంతీయ కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్ వివరించారు. సేంద్రియ పద్దతిలో సాగు చేసే పంటల నమోదు ధ్రువీకరణ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఉద్యానవన శాఖ సహాయ సంచాలకులు చక్రపాణి మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయం విశిష్టత, సాధకబాధకాలను వివరించారు. త్వరలోనే జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గ రైతులతో నిజామాబాద్ జిల్లా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి రైతులకు మార్కెట్ డైరెక్ట్ లింకేజీ విధానంలో పంట దిగుబడులు విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్, శాఖ అధికారులు సాయిబాబా, నర్సయ్య, రోహిత్, వినాయక్, జిల్లాలోని ఎఫ్‌పీవోల డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
ఉద్యానవనశాఖ మాజీ సంచాలకులు వెంకటరామిరెడ్డి
సేంద్రియ, సహజ వ్యవసాయంపై రైతులకు ఒక రోజు శిక్షణ