సుభాష్‌నగర్: నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలు, ఇందూరు నగర అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తా మని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రధాన కార్యదర్శి కటికితల శ్రీనివాస్ పే ర్కొన్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్‌లో ఆయనను ఎంపీ అర్వింద్ , ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, డాక్టర్ సంజయ్‌కుమార్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా నగర సుందరీకరణ, రోడ్లు, పార్కులు తదితర నిర్మాణాలపై చర్చించినట్లు ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధన్‌పాల్ తెలిపారు. అభివృద్ధి పనులకు కేంద్ర నిధులు వచ్చేలా కృషి చేస్తానని శ్రీనివాస్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోరెపల్లి సత్యనారాయణ, జ్యోతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ సీఎంను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యే ధన్‌పాల్ ఢిల్లీ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ
ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
ఢిల్లీలో కలిసిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు