● సగం కొనుగోలు కేంద్రాలు
మహిళా సంఘాలకు కేటాయింపు
● కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
● రెంజల్‌లో కేంద్రాల పరిశీలన
రెంజల్(బోధన్): కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం సేకరణకు సంబంధించిన రికార్డులను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు నిర్వాహకులకు సూచించారు. జిల్లాలో 50 శాతం కేంద్రాలను మహి ళా సంఘాలకు కేటాయించినట్లు తెలిపారు. రెంజల్ మండలం దూపల్లి, దండిగుట్ట, రెంజల్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. కేంద్రాల నిర్వహణ, రికార్డుల నమోదులను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 700 కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటి వరకు 100 కేంద్రాల్లో కొనుగోళ్లు మొదలైనట్లు తెలిపారు. రైతులకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. దూపల్లి, దండిగుట్ట, రెంజల్ కేంద్రాల్లో ట్రక్‌షీట్‌లు అందించకపోవడం, రిజిస్టర్‌లలో వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడంపై కలెక్టర్ అ సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రక్‌షీట్లు వచ్చిన వెంటనే ట్యాబ్‌లో ఎంట్రీ చేసి రైతుల నుంచి సేకరించిన ధాన్యం రకం, ఎన్ని క్వింటాళ్లో స్పష్టంగా తెలిసేలా రసీదులు అందించాలన్నారు. దీంతో బిల్లుల చెల్లింపుల్లో తేడా లు రాకుండా ఉంటుందన్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో విండో సీఈవోలు, ఏఈవోలు సహకరించాలన్నారు. ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్, హమాలీలు, లారీల కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్‌వో అరవింద్‌రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు, ఇన్‌చార్జి తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఏపీఎం చిన్నయ్య ఉన్నారు.