సిరికొండ: ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సిరికొండ మండలం ముషీర్‌నగర్, గడ్కోల్, తాళ్లరామడుగు, హుస్సేన్‌నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ముషీర్‌నగర్‌లో వర్షానికి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. దళారులను ఆశ్రయించొద్దు
నిజామాబాద్ రూరల్: రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని గుండారం సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్ అన్నారు. రూరల్ మండలంలోని గుండారంలో ఏర్పాటు చేసిన కొనుగొలు కేంద్రాన్ని గ్రామ ప్రత్యేకాధికారి, తహసీల్దార్ అనురుద్‌తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని వి క్రయించాలని కోరారు.
బర్ధిపూర్‌లో..
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం బర్ధిపూర్, డిచ్‌పల్లి సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ప్రభాకర్, మండల వ్యవసాయాధికారి సుధామాధురి, సొసైటీ చైర్మన్లు రామకృష్ణ, రాంచందర్‌గౌడ్ శుక్రవారం ప్రారంభించారు.