కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి | - | Sakshi

కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి

Apr 5 2025 12:50 AM | Updated on Apr 5 2025 12:50 AM

కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి

కొనుగోళ్లను త్వరగా చేపట్టాలి

సుభాష్‌నగర్‌: జిల్లాలో అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి శుక్రవారం ప్రకటనలో డిమాండ్‌ చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ఆలస్యం కావడంతోనే కళ్లాల్లో ఉన్న పంట అకాల వర్షానికి తడిసిందన్నారు. ప్రభుత్వం రైతు ఉత్పిత్తిదారుల సంఘాలు, సొసైటీలు, డీసీఎంఎస్‌, ఐకేపీల ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశాలిస్తే.. అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన గ్రామాల్లో ఐకేపీ ద్వారా కొనుగోళ్లు చేపడుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికార యంత్రాంగం వెంటనే తీరు మార్చుకుని కొనుగోళ్లను త్వరగా చేపట్టాలని డిమాండ్‌చేశారు.

తడిసిన ధాన్యం పరిశీలన

ధర్పల్లి: మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని బీజేపీ కిసాన్‌ మోర్చ రాష్ట్ర నాయకుడు నూతల శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. బీజేపీ మండలాధ్యక్షుడు మహిపాల్‌ యాదవ్‌, రైతులు ఉన్నారు.

లబ్ధిదారులు పనులు ప్రారంభించాలి

మోపాల్‌: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి గోవింద్‌ సూచించారు. శుక్రవారం మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో రాములు నాయక్‌, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌, లబ్ధిదారులు ఉన్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

మండలంలోని ముదక్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి గోవింద్‌, ఎంపీడీవో రాములు నాయక్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. వారి వెంట డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో తుకారాం రాథోడ్‌, సిబ్బంది ఉన్నారు.

గురుకుల సందర్శన

డిచ్‌పల్లి: జిల్లా కేంద్రంలోని కోటగల్లి శంకర్‌భవన్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ట్విన్నింగ్‌ ప్రోగ్రాం పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను సందర్శించారు. సైన్స్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌లను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం డిచ్‌పల్లి మండలం రాంపూర్‌ శివారులోని విశ్వ ఆగ్రోటెక్‌ను సందర్శించారు. ఉపాధ్యాయులు శైలేష్‌, గంగాకిషన్‌, గోపి, రాములు, స్వర్ణలత, విద్యార్థులు పాల్గొన్నారు.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి

నిజామాబాద్‌ రూరల్‌: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు బాగిర్తి బాగారెడ్డి అన్నారు. రూరల్‌ మండలంలోని మల్కాపూర్‌లో ఉన్న ప్రభుత్వ పాటశాలలో ఫేర్‌వెల్‌ పార్టీ నిర్వహించారు. విద్యార్థుల డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీ రామనారాయణ, నోడల్‌ ఆఫీసర్‌ అమరనాథ్‌, సీతాదేవి, చక్రపాణి ,శ్రీనివాస్‌, రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement