
సామిల్‌లో అగ్ని ప్రమాదం
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఫూలాంగ్ చౌరస్తా వద్ద ఉన్న రెండు సామిల్స్‌లో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మొదట శంకర్ సామిల్, సాగ్వాన్ సామిల్‌లో మంటలు అంటుకోగా, పక్కన ఉన్న పద్మారావు సామిల్‌లోకి మంటలు వ్యాపించాయి. రెండు సామిల్స్‌లో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఫైరింజన్‌కు సమాచారం అందించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ పరమేశ్వర్ పర్యవేక్షణలో ఘటనా స్థలానికి నాలుగు ఫైరింజన్లు చేరుకోగా, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్‌రావు, సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కు వెళుతున్న సీపీ పోతరాజు సాయిచైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా చూశారు. ఈ రెండు సామిల్స్‌లో దుంగలన్నీ కాలిబూడిదకాగా, సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులకు యజమానులు తెలిపినట్లు తెలిసింది. ఫైర్ సిబ్బంది సుమన్, కిరణ్‌కుమార్, ప్రశాంత్, సురేందర్, ప్రశాంత్ గౌడ్, సాయిరెడ్డి, సూరజ్ తదితరులు మంటలను ఆర్పారు.
రెండు దుకాణాల్లో మంటలు
రూ. 20 లక్షల వరకు ఆస్తినష్టం
నాలుగు ఫైరింజన్లతో
మంటలార్పిన సిబ్బంది