
అన్నివర్గాల సంక్షేమానికి బీజేపీ కృషి
సుభాష్‌నగర్: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఏకై క పార్టీ బీజేపీ అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టాలన్న శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ జీ ఆశయాలు సాధిద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అధ్యక్షతన నగరంలోని కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ.. ఏడు దశాబ్దాల నుంచి ఎందరో మహనీయుల జీవితాల త్యాగఫలంతోనే బీజేపీ రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగిందన్నారు. పదేళ్లలో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక విజయాలు సాధించిందన్నారు. బీజేపీ నాయకుల పార్టీ కాదని.. కార్యకర్తల పార్టీ అని దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎదురులేని శక్తిగా పార్టీ ఎదిగింది
అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
సూర్యనారాయణ
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం