
వివాదాల వీడీసీలు
నిజామాబాద్
ఇంటిని కూల్చేశారు
వాతావరణం
ఉదయం ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రమంగా ఎండ తీవ్రత పెరుగుతుంది. వాతావరణం పొడిగా మారుతుంది. ఉక్కపోతగా ఉంటుంది.
పచ్చిధాన్యం కొనుగోళ్లకు..
పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. తమ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.
మంగళవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లో u
నూతన కార్యవర్గం ఎన్నిక
సుభాష్‌నగర్: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్) జిల్లా నూ తన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నా రు. నగరంలోని విద్యుత్ భవన్‌లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శశికుమార్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బదావత్ సంతోష్‌నాయక్, ప్ర ధాన కార్యదర్శిగా టీ మహేందర్‌గౌడ్, వ ర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎండీ మొయినుద్దీన్‌తోపాటు 20 మంది విద్యుత్ కార్మికులతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎన్‌పీడీసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ రమణారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, బాలరాజు, విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో అంబలి కేంద్రం
నిజామాబాద్‌అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసి న అంబలి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు సోమవారం ప్రారంభించారు. తాగునీటితోపాటు ఉచితంగా అంబలి పంపిణీకి చొరవచూపడం అభినందనీయమని టీఎన్జీవో ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఉద్యోగులతోపాటు వివి ధ పనుల కోసం కలెక్టరేట్‌కు వచ్చే వారికి అంబలి కేంద్రం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు సుమన్, కార్యదర్శి శేఖర్, రాష్ట్ర నాయకుడు గైని గంగారాం తదితరులు పాల్గొన్నారు.
నగరంలో బాలిక కిడ్నాప్
ఖలీల్‌వాడి: నగరంలోని గాంధీచౌక్ ప్రాంతం నుంచి మూడేళ్ల బాలిక కిడ్నాప్ అయినట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి సోమ వారం తెలిపారు. వివరాలు ఇలా.. నగరంలోని నాగారం కె నాల్ కట్టకు చెందిన కొండవ్వ తన కుతూరు, మనవడు, మనవరాలు రమ్యతో కలిసి గాంధీచౌక్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ జీవించేది. గాంధీచౌక్ ప్రాంతంలో ఆదివారం రాత్రి కొండవ్వ తన మనవరాలు రమ్య(3)తో కలిసి నిద్రపోయింది. కొద్దిసేపటి తర్వాత నిద్రనుంచి మేల్కొనగా రమ్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఎంతవెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు గాంధీచౌక్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కి డ్నాప్ చేసినట్లు గుర్తించారు. రెండు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత నెల 27వ తేదీన నగరంలో ఓ బాలుడిని కిడ్నాప్ చేసిన తల్లీకొడుకులు రాయితోమోది హత్య చేసిన ఘటననను మరువకముందే మరో బాలిక కిడ్నాప్‌కు గురైంది.
అభివృద్ధిని మరిచి ఆగడాలు
● జిల్లాలో మితిమీరుతున్న వైనం
● మాట వినకుంటే బహిష్కరణే
● లక్షల్లో జరిమానాలు.. బహిష్కరణలు
● రాజకీయ ఒత్తిళ్లతో ఏమీ చేయలేకపోతున్న అధికారులు
30 ఏళ్ల క్రితం నిర్మించిన ఇంటిని అక్రమమంటూ వేల్పూర్ మండలం వెంకటాపూర్ వీడీసీ సభ్యులు కూల్చివేశారు. ఏళ్లు ఇంటికి ట్యాక్స్ కడుతూ వస్తున్నానని, అన్ని లీగల్‌గానే ఉన్నాయని బాధితుడు మొత్తుకున్నా వీడీసీ వినలేదు. చివరకు ఇంటిని కూల్చివేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా వీడీసీపై కేసు నమోదైంది.
ఖలీల్‌వాడి: పల్లెల అభివృద్ధికి పాటుపడాల్సిన గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ)లు వ్యక్తిగతంగా, కుల సంఘాల పరంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నాయి. కమిటీల్లో మెంబర్లుగా చలామణి అవుతున్నవారు తమ కన్నింగ్ ఆలోచనలను గ్రామస్తుల అందరి అభి ప్రాయంగా పేర్కొంటూ అమలు చేస్తున్నారు. తమ మాట వినని వారిని వెంటాడుతున్నారు. ఇళ్లను కూల్చడం, భూ ములను లాక్కోవడం, లక్షల్లో జరిమానాలు, బహిష్కరణలు.. ఇలా తమ ఆగడాలను వీడీసీలు కొనసాగిస్తున్నాయి. ఎలాంటి గుర్తింపులేని కమిటీలు గ్రామాల్లో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి.
కోడిగుడ్డు నుంచి బెల్ట్‌షాపు వరకు
గ్రామాల్లో కోడి గుడ్డు నుంచి బెల్ట్‌షాపులో మద్యం వరకు ఏది విక్రయించాలన్నా వీడీసీలు టెండర్లు నిర్వహిస్తున్నాయి. కోడిగుడ్లు, మద్యం, కూల్‌డ్రింక్స్ విక్రయాలను వేలంపాట ద్వారా అప్పగిస్తున్నాయి. వేలంపాటలో పాడిన మొత్తాన్ని వీడీసీకి చెల్లించి దుకాణాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ ధరలకు ఆయా వస్తువులను విక్రయించినా పట్టించుకునే వారు లేరు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారు.
ప్రజా ప్రతినిధులూ వీడీసీకి దాసోహమే..!
తమను వ్యతిరేకించిన ప్రజాప్రతినిధులనూ వీడీసీలు బహిష్కరించిన ఘటనలున్నాయి. ఆర్మూర్ మండలం పెర్కిట్ వీడీసీ అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను బహిష్కరించింది. వీడీసీలు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్‌లకు వెళ్లొద్దు, న్యాయస్థానాలను ఆశ్రయించొద్దు. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు వీడీసీలకు దూరంగా ఉంటూనే తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్ల నిర్మాణానికి సైతం వీడీసీల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీల కార్యదర్శులు సైతం ఇళ్ల నిర్మాణదారులను వీడీసీల వద్దకు వెళ్లాలని సూచిస్తుండడం గమనార్హం.
1970లో ఏర్పాటైన కమిటీలు
ప్రజల భాగస్వామ్యంతో పల్లెల అభివృద్ధికి కృషి చేయాలనే ఉద్దేశంతో 1970లో గ్రామాభివృద్ధి కమిటీలు ఏర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిపై చర్చించి పరిష్కార మార్గాలు చూపాలనే ఉద్దేశంతో గ్రామంలోని అన్ని వర్గాల నుంచి ఒక్కో సభ్యుడితో కమిటీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. వీడీసీలు ప్రధానంగా నీరు, మురికి కాలువలు, వీధి దీపాలు తదితర పనులపై దృష్టి సారించాలి. ప్రారంభంలో వీడీసీల ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి కొంత డబ్బును సేకరించి వాటితో గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేవారు.
జక్రాన్‌పల్లి వీడీసీ తీరే వేరు
జక్రాన్‌పల్లి వీడీసీ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. మహిళ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, అట్రాసిటీ కేసు నమోదైంది. అలాగే గ్రామంలోని రజకులకు చెందిన భూమిలో అంగడి (సంత) ఏర్పాటు చేయాలని వీడీసీ నిర్ణయించడంతో రజకులు అభ్యంతరం తెలిపారు. దీంతో రజకులను వీడీసీ బహిష్కరించగా వారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు వీడీసీపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.
న్యూస్‌రీల్
తాటి చెట్ల వివాదం ఆలయానికి చేరింది
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో గౌడ కులస్తులు, వీడీసీ మధ్య తాటిచెట్ల విషయంలో నెలకొన్న వివాదం ఆలయానికి చేరింది. గౌడ కులానికి చెందిన మహిళలు శ్రీరామనవమి సందర్భంగా కుంకుమార్చన చేసేందుకు ఆలయానికి వెళ్లారు. అయితే అప్పటికే గౌడకులస్తులపై వీడీసీ కఠినంగా ఉండడంతో పూజకు వచ్చిన మహిళలకు ఆలయ పూజారి అభ్యంతరం తెలిపారు. అవమానానికి గురైన సదరు మహిళలు పూజారితోపాటు వీడీసీలోని కీలక వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదం పోలీస్ స్టేషన్ ముట్టడికి దారి తీసింది.
ఏర్గట్ల పోలీస్‌స్టేషన్ ముట్టడి
వీడీసీ సభ్యులపై కేసు నమోదు..
తాళ్లరాంపూర్ గ్రామస్తుల ఆగ్రహం
మేం చెప్పిందే చట్టం అంటున్నారు
మల్లాపూర్ వీడీసీపై ప్రజావాణిలో ఫిర్యాదు
తెయూలో ఖాళీలు ఇలా..
డిచ్‌పల్లి: తాము చెప్పిందే చట్టమని దౌర్జన్యం చేస్తూ తన సొంత భూమిలోకి రానివ్వడం లేదని మండలంలోని మల్లాపూర్ వీడీసీపై రాంపూర్ గ్రామానికి మహ్మద్ షేర్‌ఖాన్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ హనుమంతుకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి మహమ్మద్ మీర్‌సాబ్ 1988లో మల్లాపూర్‌కు చెందిన గోద ఒడ్డెన్న వద్ద సర్వే నంబర్ 262/అ లో 3.2750 ఎకరాలు, సర్వే నెంబర్ 263లో 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడని, తన తండ్రి మరణం తరువాత ఆ భూమిలో తాను పంటలు సాగు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత కొద్ది రోజులుగా మల్లాపూర్ వీడీసీ సభ్యులు పది మంది తన భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించారని, భూమి తమ గ్రామానికి చెందిన వారిదని, ఇటువైపు రావొద్దని బెదిరిస్తున్నాడని తెలిపాడు. ఈ భూమిని తన తండ్రి కొనుగోలు చేశాడని, మీ వద్ద రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటే చూయించాలని వీడీసీ సభ్యులను తాను అడిగితే.. తాము ఏది చెబితే అదే చట్టమని బెదిరిస్తున్నారని వీడీసీపై ఫిర్యాదు చేశాడు.
మోర్తాడ్(బాల్కొండ): గ్రామంలోని తాటి చెట్లను గీయించాలని లేని పక్షంలో వాటిని తమకు స్వాధీనం చేయాలని మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ పట్టుబట్టింది. దీన్ని గౌడకులస్తులు వ్యతిరేకించడంతో వివాదం ఏర్పడింది. శ్రీరామ నవమి సందర్భంగా కుంకుమ పూజలో పాల్గొనేందుకు గుడికి వెళ్లిన తమను వెళ్లగొట్టారని గౌడ కులానికి చెందిన మహిళలు వీడీసీతోపాటు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పూజారితోపాటు ముగ్గురు వీడీసీ సభ్యులపై కేసు నమోదైంది. దీన్ని వ్యతిరేకిస్తూ గౌడ కులస్తులను మినహాయించి మిగతా గ్రామస్తులు ఇంటికి ఇద్దరి చొప్పున తరలివెళ్లి ఏర్గ ట్ల పోలీస్ స్టేషన్‌ను సోమవారం ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. భీమ్‌గల్ సీఐ సత్యనారాయణ, ఏర్గట్ల ఎస్సై రాము తాళ్లరాంపూర్ గ్రా మస్తులతో చర్చలను జరిపారు. వీడీసీ సభ్యులతోపాటు పూజారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయొద్దని గ్రామస్తులు పట్టుబట్టారు. రెండు వర్గాల వాదనలను విన్న పోలీసులు గ్రామంలోనే శాంతియుత వాతావరణంలో చర్చలను జరిపిస్తామని, అప్పటి వరకూ ఒకరి జోలికి ఒకరు వెళ్లి వివాదం పెద్దది చేయొద్దని సూచించారు. దీంతో తాళ్లరాంపూర్ గ్రామస్తులు వెనుదిరిగారు.

వివాదాల వీడీసీలు

వివాదాల వీడీసీలు

వివాదాల వీడీసీలు

వివాదాల వీడీసీలు

వివాదాల వీడీసీలు