
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
● ప్రజావాణికి 70 వినతులు
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 70 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీపీవో శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
బకాయిలు ఇప్పించండి
గత కొన్ని సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు నిధులు మంజూరు కావడంలేదు. దీంతో విద్యార్థులకు విద్య అందించడం చాలా ఇబ్బందిగా మారింది. కోట్ల రూపాయల బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయాలి. – జయసింహ గౌడ్,
విజ్ఞాన్ హైస్కూల్ కరస్పాండెంట్

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి