
డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన డిజిట ల్ లైబ్రరీ విభాగాన్ని ఉద్యోగార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అన్నారు. ఇంటర్నెట్ సేవలతో కూడిన డిజిటల్ లై బ్రరీ కోసం ప్రత్యేకంగా రూ.5 లక్షలు సమకూర్చ గా, పది కంప్యూటర్లతో డిజిటల్ లైబ్రరీని నెల కొల్పారు. దీనిని కలెక్టర్ బుధవారం ప్రారంభించా రు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న జిల్లాకు చెందిన యువతతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు జిల్లా కేంద్ర గ్రంథాలయం సేవలను వినియో గించుకుంటున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశామన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు స్టడీ మెటీరియల్‌ను ఆన్‌లైన్ ద్వారా సేకరించుకునేందుకు డిజిటల్ లైబ్రరీ ఉపయోగపడుతుందన్నారు. గ్రంథాలయంలో స్థలం సరిపోవడం లేదని, ఈ స మస్యను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే పాత డీఈఓ కార్యాలయంలోని గ దులను రీడింగ్ రూమ్‌లుగా వినియోగించుకుంటున్నట్లు తె లిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, తదితరులు చొరవ చూపి గత నెలలో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేశ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగ్గారెడ్డి, అధికారులు, సిబ్బంది రాజారెడ్డి, నరేశ్‌రెడ్డి, తారకం, రాజేశ్వర్, శ్రీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని
సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు