
మంచిప్ప ప్రాజెక్టు పూర్తి చేయిస్తా
జక్రాన్‌పల్లి: ప్రాణహిత చేవెళ్ల పథకంలో భాగంగా మంచిప్ప ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని నిజా మాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని పుప్పాలపల్లి, గన్యాతండా, మా దాపూర్, సికింద్రాపూర్, పడకల్, కలిగోట్, చింతలూర్ గ్రామాల్లో రూ.6 కోట్ల 74లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూపతిరెడ్డి బుధ వారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ యా చోట్ల ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.90 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి సాగునీరు అందివ్వలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. రూరల్ నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. మొదటి విడతలో ప్లాట్లు ఉన్న లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. రెండో విడతలో అర్హులైన వారికి 75 గజాల ఇంటి స్థలం కేటాయించి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. ఎక్కడా లేని విధంగా రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతు న్నాయని, సుద్దులంలో ఇంటిగ్రేటేడ్ స్కూల్, జ క్రాన్‌పల్లి మండలంలో నవోదయ పాఠశాల ఏ ర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యువత రాజీవ్ యువవికాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సా యారెడ్డి, మాజీ ఎంపీపీ అప్పాల రాజన్న, పార్టీ అధ్యక్షుడు చిన్నారెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరే శ్, చిన్న సాయారెడ్డి, వినోద్, పురుషోత్తంరెడ్డి, రాజేందర్, విఠల్, అరుణ్, రవిగౌడ్, గణేశ్, గంగారెడ్డి, నర్సారెడ్డి, నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్లలో నియోజకవర్గం సస్యశ్యామలం
ఏడు వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
మొదటి విడతలో ప్లాట్లు ఉన్న వారు ఇళ్లు నిర్మించుకోవాలి
రెండో విడతలో స్థలం కేటాయించి ఇళ్లు నిర్మిస్తాం
నిజామాబాద్ రూరల్
ఎమ్మెల్యే భూపతిరెడ్డి