
రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా
ఖలీల్‌వాడి : రౌడీషీట్ ఉన్నవారిపై పోలీసుల ప్రత్యే క నిఘా ఉంటుందని, రౌడీషీటర్లలో మార్పు రాకుంటే పీడీయాక్ట్ అమలు చేస్తామని ఏసీపీ రాజావెంక ట్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీషీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం గురువారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్ల నేర చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. రౌ డీషీటర్లు గ్రూపు తగాదాలు, నేరాలలో పాల్గొనవద్ద న్నారు. నేరప్రవృత్తిని వీడి కుటుంబ సభ్యులతో కలి సి ఉండాలన్నారు. ఉపాధి పొంది సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ తొలగిస్తామని తెలిపారు. చెప్పుడు మాటలు విని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పా ల్పడితే జైలుపాలవ్వడం తప్పదన్నారు. రౌడీషీటర్ల ఇళ్ల ను రాత్రి, పగలు తేడా లేకుండా ఎప్పుడైనా తనిఖీ చేస్తామన్నారు. ఏదైనా సమస్య, అపాయం ఉంటే పోలీసులను సంప్రదిస్తే సహాయం అందజేస్తారని సూచించారు. కార్యక్రమంలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై గంగాధర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మార్పు లేకుంటే పీడీయాక్ట్ అమలు
సత్ప్రవర్తనతో ఉంటే రౌడీషీట్ ఎత్తేస్తాం
ఏసీపీ రాజా వెంకట రెడ్డి