
ధాన్యం రక్షణ కోసం రైతుల పాట్లు
రైతులు తమ పంటల(ధాన్యం, పసుపు)ను విక్రయించడానికి నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఇటీవల పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. గురువారం సాయంత్రం వాతావరణం మార్పుల కారణంగా నిజామాబాద్ జిల్లాకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. వర్షంనుంచి పంటను కాపాడుకోవడానికి ముందస్తు జాగ్రత్తగా మార్కెటింగ్ శాఖ రైతులకు టార్ఫాలిన్లను పంపిణీ చేసింది. దీంతో రైతులు పంటలు తడవకుండ టార్ఫాలిన్లను కప్పుతున్న దృశ్యాలను సాక్షి క్లిక్ మనిపించింది.
–సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్