
‘సలహా కమిటీ’ లో జిల్లాకు ప్రాధాన్యం
మోర్తాడ్/నిజామాబాద్ రూరల్: సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీ అమలు, గల్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఇందుకోసం రెండేళ్ల పాటు అధ్యాయనం చేయడానికి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్‌ను గౌరవ సభ్యులుగా నియమించారు. అలాగే సభ్యుడిగా దుబాయ్‌లో ఉండే జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌వాసి సత్యం నారాగౌ డ్ సభ్యుడిగా నియమితులయ్యారు. 15 మందితో కూడిన కమిటీలో జిల్లా నుంచి కీలక నేతలకు స్థానం దక్కడం విశేషం. కమిటీ చైర్మన్‌గా మాజీ రాయబారి వినోద్ కుమార్‌ను ఎంపిక చేయగా వైస్ చైర్మన్‌గా గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు మంద భీంరెడ్డిని ఎంపిక చేశారు. గౌరవ సభ్యులుగా జిల్లా నేతలను నియమించడంతో ప్రాధాన్యం దక్కిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. వలస కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర ఎన్‌ఆర్‌ఐ పాలసీని రూపొందించడమా? లేదా గల్ఫ్ బోర్డును ఏర్పాటు చేయడమా? ఇందు కోసం అధ్యయనం చేయాలని ప్రభుత్వం కమిటీకి నిర్దేశించింది.
రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డితోపాటు, మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్‌ను ఎంపిక చేసిన ప్రభుత్వం

‘సలహా కమిటీ’ లో జిల్లాకు ప్రాధాన్యం

‘సలహా కమిటీ’ లో జిల్లాకు ప్రాధాన్యం