
ఒకే ఎజెండాతో పోరాడాలి
రాజకీయ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండాతో ఉద్యమించాలి. వర్సిటీలో ఇంజినీరింగ్ కాలేజీ సాధించే వరకు జేఏసీగా ఏర్పడి పోరాడాలి. యంగ్ ఇండియా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఏఐ కోర్సులు, సాంకేతిక విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. అయితే జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేయడంలో తీవ్ర వివక్ష చూపుతోంది. అన్నివర్గాల ప్రజలు, మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు ఒకే ఎజెండాతో పోరాడాలి.
– రమావత్ లాల్‌సింగ్, తెలంగాణ విద్యార్థి
ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్