
జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు..
ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు విషయమై జిల్లా ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేదు. చిన్నచిన్న జిల్లాలకు ఇంజినీరింగ్ కళాశాలలు మంజూరయ్యాయి. వసతి, సౌకర్యాలపరంగా అన్ని విధాలా అనుకూలంగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడం దురదృష్టకరం. ఇంజినీరింగ్ కాలేజ్ ఏర్పాటుపై అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ ఒక్కరే మాట్లాడారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడిన పాపాన పోలేదు. ఇంజినీరింగ్ కాలేజీ విషయంలో ఐక్యంగా పోరాడాలి.
– పిల్లి శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు