అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు | - | Sakshi

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Apr 12 2025 2:15 AM | Updated on Apr 12 2025 2:15 AM

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

ఏడుగురు సభ్యుల మహారాష్ట్రకు

చెందిన పార్థి గ్యాంగ్‌

జాతీయ రహదారిపై దారిదోపిడీలు

వివరాలు వెల్లడించిన కామారెడ్డి

ఎస్పీ రాజేష్‌ చంద్ర

కామాడ్డి క్రైం: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని జాతీయ రహదారి 44 వెంబడి ఆగి ఉన్న వాహనాలను టార్గెట్‌ చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా (పార్థి గ్యాంగ్‌)ను కా మారెడ్డి పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్‌ చంద్ర వివరాలు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలో కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌, దేవునిపల్లి పీఎస్‌ల పరిధిలో రెండు దారి దోపిడీ ఘటనలు వెలుగు చూ శాయి. వాటిలో ఒకటి ఈ నెల 2 న టేక్రియాల్‌ వద్ద జరిగింది. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన కుమారుడిని హైదరాబాద్‌లోని హాస్టల్‌ నుంచి కారు లో ఇంటికి తీసుకుని వస్తూ తెల్లవారు జామున టేక్రి యాల్‌ సమీపంలోని దాబా వద్ద రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసుకుంటున్నారు. గమనించిన దుండగులు కారు అద్దాలు పగులగొట్టి కత్తులతో బెదిరించి ల్యాప్‌టాప్‌, మరో బ్యాగును ఎత్తుకెళ్లా రు. కేసు నమోదు చేసి విచారణ జరుపగా ఇలాంటి ఘటనలు ఎన్‌హెచ్‌–44 వెంబడి తరచుగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను ప ట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

పంక్చర్‌ షాప్‌ యజమాని ఇచ్చిన క్లూతో..

మహారాష్ట్ర లోని వార్దా జిల్లాకు చెందిన కులీ కిషన్‌ పవార్‌, జాకీ గుజ్జు భోంస్లే, పవార్‌ హరీష్‌, అతని భార్య హౌరా పవార్‌, అనురాగ్‌ రత్నప్ప భోంస్లే, అతని భార్య అంచనా భోంస్లే, చూడీ లను ప్రస్తుతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిరంజీవి, గుండా, సాంబ భోంస్లే, బంగారు భోంస్లేలు పరారీలో ఉన్నారు. వీరంతా వార్దా జిల్లాలోని ఓలాంనగర్‌, సముద్రాపూర్‌, శివగ్రాం గ్రామాలకు చెందిన వారు. వారంతా ముఠాగా ఏర్పడి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. పంక్చర్‌ షాప్‌ యజమాని ఇచ్చిన క్లూతో నిందితులను గుర్తించడం సాధ్యమయిందని ఎస్పీ తెలిపారు. టేక్రియాల్‌ వద్ద దుకాణం నడుపుతున్న షకీల్‌ పోలీసులకు యేడాది క్రితం జరిగిన ఓ దారి దోపిడీ ఘటనను వివరించి బాధితుడి అడ్రస్‌ ఇచ్చాడు. అతని ద్వారా నిందితుల ఆనవాళ్లు తెలుసుకున్నామని తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐలు శ్రీనివాస్‌, రామన్‌, సంతోష్‌ కుమార్‌, ఎస్సైలు రాజు, రంజిత్‌, ఉస్మాన్‌, సిబ్బంది రవి కిరణ్‌, రవి లను ఎస్పీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement