
విద్యకు దూరమవుతున్నారు
తెయూలో ఇంజినీరింగ్ కాలేజీ లేకపోవడవంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు ఆదిలాబా ద్ జిల్లాకు చెందిన ఎంతోమంది గ్రామీణ ప్రాంత వి ద్యార్థులు సాంకేతిక విద్య కు దూరమవుతున్నారు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి రెండుసార్లు హామీ ఇచ్చినా జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు కాకపోవడం జిల్లా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే. మంత్రి పదవుల్లో ఉన్నవారు తమ జిల్లాలకు ఇంజినీరింగ్ కాలేజీలు తెచ్చుకుంటున్నారు. జిల్లాకు మంత్రి పదవి లేకపోవడంతో ఈ విషయమై పట్టించుకునే వారు కరువయ్యారు.
– జే రాజేశ్వర్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు