నంబర్‌ ప్లేట్‌ మార్చాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

నంబర్‌ ప్లేట్‌ మార్చాల్సిందే!

Apr 13 2025 1:53 AM | Updated on Apr 13 2025 1:53 AM

నంబర్‌ ప్లేట్‌ మార్చాల్సిందే!

నంబర్‌ ప్లేట్‌ మార్చాల్సిందే!

పాత వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ

ఏర్పాటు చేసుకోవాలని

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం

సెప్టెంబర్‌ 30 వరకు గడువు

ఖలీల్‌వాడి: ఓల్డ్‌ వెహికిల్‌ వాడుతున్నారా? ఆ వా హనం 2019 ఏప్రిల్‌ 1కి కంటే ముందు తయారైందా? అయితే.. దీనికి హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లే ట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) పెట్టుకోవాల్సి వస్తుంది. బైక్‌ల నుంచి ఫోర్‌ వీల్స్‌ వరకు ఏదైనా తప్పనిసరిగా ఈ నంబర్‌ ప్లేట్‌ను పెట్టుకోవాలి. ఈమేరకు రాష్ట్ర రవాణాశాఖ ఇటీవల గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అలాగే గడువును ఈ ఏడాది సెప్టెంబర్‌ 30న చి వరి తేదిగా నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ దేశాల మేరకు రవాణాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చే సింది. నకిలీ నంబర్‌ ప్లేట్లను, వాహనాల చోరీలను అరికట్టడంతోపాటు రహదారి భద్రత లక్ష్యంగా నెంబర్‌ ప్లేట్‌లను ఏర్పాటు చేయనున్నారు.

లేకుంటే కేసులే..

పాత వాహనాలకు కొత్త నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. లేకుంటే సదరు వాహనం అమ్మాలన్నా...కొనాలన్నా ఆర్టీఏ ఆఫీసులో పేరు మార్చుకోవడానికి వీలు ఉండదు. ఈ వాహనానికి ఇన్సూరెన్స్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వరు. హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకుంటే కేసు నమోదు చేస్తారు.

జిల్లాలో 10, 700లకు పైగా వాహనాలు

జిల్లాలో 2019, ఏప్రిల్‌ 1కంటే ముందు 10,700 లకుపైగా వాహనాలు ఉన్నాయి. ఇందులో ద్విచక్రవాహనాలు, ఫోర్‌వీలర్స్‌, త్రీవీలర్స్‌, కమర్షియల్‌ వెహికిల్స్‌ ఉన్నాయి. ఈ వాహనాలన్నింటికీ హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

వివిధ రకాల వాహనాలకు ధరలు ఇలా..

ఆన్‌లైన్‌లో బుకింగ్‌..

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ కోసం www. siam.in వెబ్‌సైట్‌లో వెహికిల్‌ వివరాలు నమోదు చేసి బుక్‌ చేసుకోవాలి. కొత్త ప్లేట్‌ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. వీటిని ఆర్టీఏ కార్యాలయంలో అందుబాటులో ఉంచి నంబర్‌ప్లేట్లను బిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా రవాణాశాఖ అధికారి ఉమమహేశ్వర్‌రావును వివరణ కోరగా రాష్ట్ర రవాణాశాఖ నుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేవన్నారు. ఉత్తర్వులు అందిన వెంటనే హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లు బిగించేందుకు ప్రత్యేకంగా కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement