
జై శ్రీరాం.. వీర హనుమాన్
నిజామాబాద్ రూరల్: హనుమాన్ జయంతిని పురస్కరించుకొని హిందూవాహిని, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో శనివారం నగరంలో హనుమాన్ విజయయాత్రను ఘనంగా నిర్వహించారు. నీలకంఠేశ్వర ఆలయం వద్ద శోభాయాత్ర రథానికి ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. కంఠేశ్వర్, సుభాష్‌నగర్, హమాల్‌వాడీ, దేవీరోడ్, గాంధీ చౌక్, నెహ్రూ పార్క్ చౌరస్తా మీదుగా ఆర్‌ఆర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. విజయయాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధార్మిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేశారు. జై శ్రీరాం.. వీర హనుమాన్ నినాదాలు మార్మోగాయి. హనుమా న్ శోభాయాత్రతో ఇందూరు వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. హనుమాన్, శ్రీ రాముడు, పరమశివుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్, దత్తాత్రేయ స్వామి, భరతమాత భారీ ప్రతిమలు శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రోటరీ క్లబ్ జేమ్స్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ నిర్వహించారు. ర్యాలీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, నుడా చైర్మన్ కేశ వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రత్నాకర్, విశ్వహిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి దయానంద్, జిల్లా సహాయ కార్యదర్శి దాత్రిక రమేశ్, బజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
1500 మంది పోలీసులతో బందోబస్తు
ఖలీల్‌వాడి: నగరంలో శనివారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ర్యాలీ ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పీ సాయిచైతన్య పరిశీలించారు. సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో ఏర్పాటు చేసిన 225 సీసీ కెమెరాల ఫుటేజీ విభాగాల ద్వారా హనుమాన్ శోభాయాత్రను వీక్షించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 34 హనుమాన్ జయంతి ర్యాలీలు జరిగినట్లు చెప్పారు.
శోభాయమానంగా విజయయాత్ర
కాషాయమయమైన
ఇందూరు వీధులు

జై శ్రీరాం.. వీర హనుమాన్

జై శ్రీరాం.. వీర హనుమాన్

జై శ్రీరాం.. వీర హనుమాన్

జై శ్రీరాం.. వీర హనుమాన్

జై శ్రీరాం.. వీర హనుమాన్

జై శ్రీరాం.. వీర హనుమాన్