
మీనయ్య మృతి ఉద్యమానికి తీరని లోటు
మోపాల్: సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు గడపురం మీనయ్య మృతి పేదలు, ఉద్యమానికి తీరని లోటని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గడపురం మీన య్య అంత్యక్రియలు నగరశివారులోని బోర్గాం(పి)లో శనివారం నిర్వహించారు. మీనయ్య భౌతికకాయానికి న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, వేల్పూర్ భూమయ్య, ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు కంజర భూమయ్య, నాగభూషణం, పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా, రమేశ్, ఎర్రన్న, చిన్నయ్య, నర్సయ్య, మల్లికార్జున్, భుజేందర్, లక్ష్మి, రాజశేఖర్, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కూలీ డబ్బులు చెల్లించాలి
సిరికొండ: ఉపాధి హామీ కూలీలకు కూలి డబ్బులు చెల్లించాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి బాలయ్య డిమాండ్ చేశారు. గడ్కోల్‌లో ఉపాధి హామీ కూలీలతో శనివారం సమావేశమయ్యారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పది వారాల నుంచి కూలి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోయారు. ప్రభుత్వం వెంటనే కూలీలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయకులు భూమేశ్, ఎల్లయ్య, చిన్న గంగాధర్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.

మీనయ్య మృతి ఉద్యమానికి తీరని లోటు