
పన్ను చెల్లింపుల్లో నాగాపూర్ ఆదర్శం
బాల్కొండ: మండలంలోని నాగాపూర్ గ్రామం ఇంటి పన్ను చెల్లింపుల్లో ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామస్తులంతా ఇరవై ఏళ్లుగా నూరుశాతం ఇంటి పన్నులు చెల్లిస్తూ ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు. నాగాపూర్ గ్రామం ఎస్సారెస్పీలో పాక్షికంగా ముంపుకు గురైన గ్రామం. గ్రామస్తుల భూములు మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణంలో కోల్పోయారు. అయినా ధైర్యం కోల్పోకుండా తమ గ్రామాన్ని పున:నిర్మాణం చేసుకుని పూర్వ వైభవం కోసం కృషి చేశారు. ఏటా ఆర్థిక సంవత్సరం ముగింపునకు ముందే నూరు శాతం ఇంటి పన్నును చెల్లిస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కూడా పన్నులను చెల్లించారు. ఇంటి పన్ను చెల్లింపులోనే కాదు రాజాకీయంగా కూడ చైతన్యవంతమైన గ్రామం. గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చిన కలిసి కట్టుగా ఉండి పరిష్కరించుకుంటారు. ఎవరికి సమస్య వచ్చిన గ్రామ సమస్యగా భావిస్తారు. జీపీ వద్దకు రావాలని ఒక్కసారి మైక్‌లో ప్రకటిస్తే చాలు ఇంటికి ఇద్దరు చొప్పున వచ్చి వాలుతారని గ్రామస్తులు అంటున్నారు. మురికి కాలువలు, సీసీ రోడ్లు, తాగునీటి వసతిని కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయుటకు నిధులను మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఒక్కసారి చెబితే..
గ్రామస్తులు ఇరవై ఏళ్ల నుంచి నూరు శాతం ఇంటి పన్ను చెల్లిస్తున్నారు. ఒక్కసారి చెబితే చాలు కార్యాలయానికి వచ్చి పన్ను చెల్లిస్తారు. ప్రజలు అధికారులతో ఎప్పుడూ సహకరిస్తునే ఉంటారు.
– అబ్దుల్ కలీం, కారోబార్, నాగాపూర్
అందరూ ముందే చెల్లిస్తారు..
ఇంటి పన్ను చెల్లింపులో మా గ్రామస్తులు ఆదర్శంగా ఉంటారు. ఇంటి పన్ను ఏడాది అయ్యేలోపు అడగ కుండానే చెల్లిస్తారు. గత ఇరవై ఏళ్లు నూరు శాతం పన్ను లు చెల్లించడం గ్రామానికే గర్వంగా ఉంది.
– వెంకటేశ్‌గౌడ్, మాజీ సర్పంచ్, నాగాపూర్
రెండు దశాబ్దాలుగా వంద శాతం పన్నులు చెల్లిస్తున్న గ్రామస్తులు

పన్ను చెల్లింపుల్లో నాగాపూర్ ఆదర్శం

పన్ను చెల్లింపుల్లో నాగాపూర్ ఆదర్శం