
రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు
● డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి
వేల్పూర్: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశామని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మా ట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో 1,250 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నా రు. నిజామాబాద్ జిల్లాలో 2 లక్షల క్వింటాళ్ల సన్నరకాలు, 50 వేల క్వింటాళ్ల దొడ్డురకం, కామారెడ్డి జిల్లాలో లక్షా 60 వేల క్వింటాళ్ల సన్నరకం, 40 వేల క్వింటాళ్ల దొడ్డురకం ధా న్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సన్నరకాలు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తోందన్నారు. ఈ నెల 11 వరకు ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల లో డబ్బులు జమ అయినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో సరిపడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
నేడు బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత రాక
బాన్సువాడ : బాన్సువాడకు మంగళవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రానున్నారు. పట్టణంలోని భారత్ గార్డెన్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారని బీఆర్‌ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు