
సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగునీటి ప్రణాళికలపై సీఎం దిశానిర్దేశం చేశారు. భూ భారతి చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమ స్య తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సీఎం సూచించారు.
జింక పిల్ల లభ్యం
● అటవీశాఖ సిబ్బందికి అప్పగింత
రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రా మశివారులో సోమవారం రైతులకు కనిపించిన జింకపిల్లను స్థానికులు అటవీశాఖ సి బ్బందికి అప్పగించారు. తప్పిపోయి వచ్చిన జింకపిల్ల వ్యవసాయ పనులు చేస్తున్న రై తుల కంట పడింది. సమాచారం అందుకు న్న అటవీశాఖ సిబ్బంది కల్లూర్‌కు చేరుకొని జింక పిల్లను వర్ని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి చికిత్స చేయించారు. జింక పిల్ల వయస్సు వారం రోజుల్లోపే ఉంటుందని, ఆరోగ్యంగా తయారైన అనంతరం అడవిలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.
డంపింగ్ యార్డులో
కమిషనర్ తనిఖీలు
నిజామాబాద్ సిటీ: నగర శివారులోని నాగా రం డంపింగ్‌యార్డును సోమవారం రాత్రి 10 గంటలకు ఇంజినీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ దిలీప్‌కుమార్ ఆకస్మిక తని ఖీ చేశారు. యార్డులో పనిచేస్తున్న సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నిరంతరం వాటర్ పంపింగ్ చేయాలని ఇన్‌చార్జి ప్రభుదాస్, జవాన్ బజరంగ్‌కు సూచించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఈఈ మురళీమోహన్‌రెడ్డి, ఏఎంసీ జయకుమార్, శానిటరీ సూపర్‌వైజర్ సాజిద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
భూ భారతితో రైతుల సమస్యలు తీరుతాయి
నిజామాబాద్ రూరల్: ‘భూ భారతి’తో రా ష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు తీరుతాయని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. సోమవారం గుండారం రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ప్రారంభించిన భూభారతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వర్చువల్‌గా వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కేవలం కల్వకుంట్ల కుటుంబానికే అన్ని విధాలుగా ఉపయోగపడిందన్నారు. ధరణితో బీ ఆర్‌ఎస్ నేతలు కబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయాల భూములు వారి పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేయించుకున్నార ని ఆరోపించారు. ప్రస్తుతం భూ భారతిలో భూముల వివరాలు సమగ్రంగా ఉండి రై తులు, యజమానులకు అన్ని విధాలుగా అ నుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల విశ్వసనీయతను భూ భారతి చూర గొంటుందని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే భూపతిరెడ్డిని గజమాలతో సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డేలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాగిర్తి బాగారెడ్డి, అగ్గు భోజన్న, మునిపల్లి సాయారెడ్డి, గుండారం సింగిల్ విండో చైర్మన్ దాసరి శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

సీఎం సమీక్షలో పాల్గొన్న కలెక్టర్