
అక్రమార్కుల్లో వణుకు
● జిల్లాపై కొత్వాల్ ప్రత్యేక నజర్
● తనదైన మార్క్ పాలన సాగిస్తోన్న
సీపీ సాయిచైతన్య
● పేకాట, బెట్టింగ్‌పై ఉక్కుపాదం
● గంజాయి, ఇసుక రవాణాకు అడ్డుకట్ట
● వీడీసీల ఆగడాలకు చెక్‌పెట్టేలా కేసులు
● డివిజన్‌ల వారీగా పోలీస్‌బాస్ సమీక్షలు
సుదీర్ఘ సమీక్ష
కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ఆ యా డివిజన్‌ల సీఐలు, ఎస్సైలతో సీపీ ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. ఇటీవల బోధన్, నిజామా బాద్ డివిజన్లలోని పీఎస్‌లలో కేసుల వివరాలు, పెండింగ్ కేసులు, ఛార్జ్‌షీట్ వేయాల్సి కేసులు, కోర్టులో కొనసాగుతున్న కేసుల వివరాలను కూలంకషంగా తెలుసుకున్నారు. ఒక్కో కేసును పరిశీలిస్తూ జాప్యానికి కారణాలను తెలుసుకొని సూచనలు జారీ చేశారు. ఒక్కో డివిజన్‌పై సీపీ చేపట్టిన సమీక్ష ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కొనసాగడం గమ నార్హం. ఇదిలా ఉండగా పలు వివాదాల్లో తలదూర్చే సిబ్బందిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.
ఖలీల్‌వాడి: అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు నిజామాబాద్ సీపీ పోతరాజు సాయి చైత న్య. కమిషనరేట్ పరిధిలో తనదైన మార్క్ పాలన సాగిస్తూ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీ సుకుంటున్నారు. అక్రమ ఇసుక రవాణా, పేకాట, బెట్టింగ్, మత్తు పదార్థాల సరఫరాపై కొరఢా ఝళిపిస్తున్నారు. సీపీగా బాధ్యతలు చేపట్టిన అనంత రం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. మొదట ఆ యా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగే అక్రమ కార్యకలాపాలపై నివేదిక తెప్పించుకున్నారు. నేరాలు, నేరస్తులు, అక్రమదందాల స్థితిగతులపై అధ్యయనం చేసిన సీపీ..వాటికి చెక్‌పెట్టేలా చర్యలు ప్రారంభించారు.
బెట్టింగ్ నిర్వాహకులపై కేసులు
ఐపీఎల్ బెట్టింగ్‌పై కఠినంగా వ్యవహరిస్తానని ముందుగా చెప్పిన సీపీ సాయి చైతన్య.. ఆ దిశగా నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ నగర పరిధిలో బెట్టింగ్ ఆడుతున్న, నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్నారు.
వీడీసీలపై..
గ్రామాల్లో వీడీసీల ఆగడాలకు కళ్లెం వేస్తున్నారు. నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలో కుల, గ్రామ బహిష్కరణలు చేస్తున్న వీడీసీలపై కేసులు నమోదు చేయాలని పోలీసులను సీపీ ఆదేశించారు. ఇటీవల వేల్పూర్ మండలం వెంకటాపూర్, ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్, జక్రాన్‌పల్లి వీడీసీలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
అక్రమ దందాపై..
అక్రమ దందాపై సీపీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు, పొక్లెయిన్లను సీజ్ చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. అదేవిధంగా మొరం అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం, గంజాయి, మత్తు పదార్థాలు రవాణా చేసే వారిని పట్టుకుంటూ హడలెత్తిస్తున్నారు.
మత్తు వదిలేలా..
నగరంలోని పలు హాస్టళ్లపై ఇటీవల స్పెషల్ పోలీసు బృందాలు, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలైన గంజాయి, డ్రగ్స్ బారిన యువత పడకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతూ, వాహనాలతో ప్రమాదకర విన్యాసాలు చేసే పోకిరీలపై కొరఢా ఝళిపిస్తున్నారు. తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి వారి ముందే కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నారు.

అక్రమార్కుల్లో వణుకు

అక్రమార్కుల్లో వణుకు

అక్రమార్కుల్లో వణుకు