
జిల్లాలో ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’
ఖలీల్‌వాడి: జిల్లాలో ఇక నుంచి ‘మైనర్ స్పెషల్ డ్రైవ్’ నిర్వహించనున్నట్లు సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనర్లు వాహ నాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానాలు విధించేవారమని, ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు చో టుచేసుకుంటున్నాయని, ఇక నుంచి మైనర్ డ్రైవింగ్ చేస్తూ దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానిని ఎంవీ ఐ యాక్ట్–2019, సెక్షన్ 199–ఏ ప్రకారం కోర్టులో హాజరుస్తామని పేర్కొన్నారు. వాహన యజమానికి న్యాయస్థానం మూడే ళ్ల జైలు శిక్ష, రూ.25 వేల వరకు జరిమానా విధిస్తుందని తెలిపారు. వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్ 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు అర్హత ఉండదని, వాహనం రిజిస్ట్రేషన్‌ను సంవత్సరం వరకు రద్దవుతుందని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సీపీ సూచించారు.
● వాహనాలు నడుపుతూ
పట్టుబడితే కఠిన చర్యలు
● తల్లిదండ్రులు, వాహన
యజమానికి జైలు శిక్ష
● వాహన రిజిస్ట్రేషన్ రద్దు