ఇదేం పద్ధతి..? | - | Sakshi
Sakshi News home page

ఇదేం పద్ధతి..?

Apr 17 2025 1:49 AM | Updated on Apr 17 2025 1:49 AM

ఇదేం

ఇదేం పద్ధతి..?

ఇందిరమ్మ ఇళ్లు..

సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.. పక్కన ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, వ్యవసాయ కమిషన్‌ సభ్యడు గడుగు, సబ్‌ కలెక్టర్‌ వికాస్‌

ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం జిల్లాలో పర్యటించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని అభివృద్ధి కార్య క్రమాలు, పథకాలపై సమగ్రంగా చర్చించారు. ఆర్మూర్‌లో సన్నబియ్యం లబ్ధిదా రు ఇంట్లో భోజనం చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భీమ్‌గల్‌లో లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు అందజేశారు.

పేదల కడుపు నింపేందుకే సన్నబియ్యం

పెర్కిట్‌(ఆర్మూర్‌): పేద, సామాన్య ప్రజల కడు పు నింపేందుకే రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేపట్టిందని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి రేషన్‌ లబ్ధిదారుడు లక్కారం తవ్వన్న ఇంట్లో సన్నబియ్యంతో మంత్రి బుధవారం భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని తినేందుకు లబ్ధిదారులు విముఖత చూపుతూ ఇతరులకు విక్రయించి మార్కెట్‌లో సన్న బియ్యం కొనుగోలు చేసుకునే వారన్నారు. ప్రభుత్వానికి భారమైనా పేదలకోసం సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

నీటి సరఫరా తీరుపై ఇన్‌చార్జి

మంత్రి జూపల్లి అసహనం

మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్లు

ఎందుకు రాలేదు..?

కలెక్టర్‌ను ప్రశ్నించిన మంత్రి

సమస్యలను తెలుసుకునేందుకు

టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయండి

సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి

మంత్రి జూపల్లి కృష్ణారావు

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలో వేసవి సీజన్‌కు సంబంధించి తాగునీటి సరఫరా తీరుపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశా రు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లాస్థాయి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు పి సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, జిల్లాస్థా యి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకాగా, వ్యవసాయం, తాగునీటి సరఫరా, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, హౌసింగ్‌, భూ భారతిపై సమగ్రంగా చర్చించారు.

భీమ్‌గల్‌లో నీటి సమస్య ఉందని బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి మంత్రికి తెలుపగా, సంబంధిత అధికారి ఎవరని ఆయ న ఆరా తీయగా, సదరు అధికారి అందుబాటులో లేడు. దీంతో కలెక్టర్‌ను మంత్రి ప్రశ్నించగా.. మండల, మున్సిపాలిటీల స్పెషల్‌ ఆఫీసర్లను సమావేశానికి పిలవలేదని, కేవలం జిల్లా స్థాయి అధికారులను మాత్రమే పిలిచామని ఆయన సమాధానమివ్వడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల నీరు సరఫరా చేయాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని, మిషన్‌ భగీరథకు సంబంధించి నీటి సరఫరా రికార్డు నమోదవుతోందా.. అని అధికారులను ప్రశ్నించగా, వారు సరైన సమాధా నం చెప్పలేదు. నీటి సరఫరాకు సంబంధించి ని ధులను ఎలా కేటాయిస్తు న్నారని, ప్రతి వెయ్యి లీటర్లకు ఎన్ని డబ్బులు చెల్లిస్తున్నారని మంత్రి ప్రశ్నించగా.. లీటర్ల చొప్పు న కాదని.. పనిచేసే సిబ్బంది చొప్పున నిధులు కేటాయిస్తు న్నామని అధికారులు సమాధానమివ్వగా ఇదేమి పద్ధతి అని ప్రశ్నించారు. వెంటనే ఫోన్‌లో సంబంధిత కమిషనర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారం రో జుల్లో ఈ వ్యవహారంపై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నీటిసరఫ రాకు సంబంధించిన స మస్యలను తెలుసుకునేందుకు కలెక్టరేట్‌లో టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏ ర్పాటు చేయాలన్నారు. అలాగే అన్ని శాఖల కు సంబంధించి మరో టో ల్‌ ఫ్రీ నంబర్‌ అందుబాటులో ఉంటే బాగుంటుందని కలెక్టర్‌కు సూచించారు.

వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, స్థానికంగా నీటి వనరులు లేని ప్రాంతాల్లో బోరుబావులు అద్దెకు తీసుకోవాలని, ట్యాంకర్ల ద్వా రా రక్షిత మంచి నీటిని సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. అధికారులు వాస్తవ నివేదికలు ఇవ్వాలన్నారు.

పౌరసరఫరాలు..

ధాన్యం సేకరణ ప్రణాళికాబద్ధంగా కొనసాగుతోందని, జిల్లా నుంచి ఆదిలాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ తదితర జిల్లాలకు సన్న బియ్యం సరఫరా చేస్తుండడం అభినందనీయమని మంత్రి అన్నారు. 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ మంత్రికి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం అయిన వెంటనే రైతులకు పూర్తి వివరాలతో రసీదులు అందించాలని మంత్రి ఆదేశించారు.

భూ భారతి..

ధరణి కారణంగా ఇబ్బందులు పడిన రైతులకు ఊరట కలిగేలా భూ భారతిని ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపాలని, మండల, గ్రామ స్థాయిలో రైతులతో సదస్సులను నిర్వహించేందుకు నిర్ణీత షెడ్యుల్‌ ఖరారు చేసుకోవాలని సూచించారు.

కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను రెండు రోజుల్లో అందించాలని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ పక్షం రోజుల్లో మంజూరయ్యే లా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహె ర్‌ బిన్‌ హందాన్‌, వ్యవసాయ, రైతు కమిషన్‌ సభ్యు డు గడుగు గంగాధర్‌, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సన్నబియ్యం పంపిణీ..

సన్న బియ్యం పంపిణీ సజావుగా సాగేలా పర్యవేక్షించాలని, రేషన్‌ డీలర్ల ఖాళీలను నెల రోజుల్లోగా పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. రేషన్‌ దుకాణాలకు సరైన నిష్పత్తిలో కోటా కేటాయింపులు జరిగేలా చూడాలన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను ఎంపిక చేయాలని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గొద్దని, అక్రమాలకు తావిస్తే రికవరీ చే యిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మా ణం చేపట్టే ఆర్థిక స్థోమత లేని పేదలకు ఐకేపీ మహిళా సంఘాల ద్వారా ఇళ్లను నిర్మించి ఆ తరువాత బిల్లులను మహిళా సంఘాలకు అందించేలా చొరవ చూపాలని ఆదేశించారు.

ఇదేం పద్ధతి..?1
1/1

ఇదేం పద్ధతి..?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement