
పులి జాడలను పరిశీలిస్తున్న ఆంధ్రాకు చెందిన అటవీ శాఖ అధికారులు
రాయగడ: జిల్లాలోని గుణుపూర్ సరిహద్దు ప్రాంతమైన మన్యం జిల్లా భామిని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వార్త దావానంలా వ్యాపించడంతో గుణుపూర్ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ నీలమాధవ పాఢి సిబ్బందితో గుణుపూర్‌లోని అటవీ ప్రాంతాన్ని సోమవారం సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, అడవుల్లోకి పశువులను మేతకు విడిచిపెట్టవద్దని హెచ్చరించారు.
ఇదిలాఉండగా భామిని ఫారెస్ట్ సిబ్బంది పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ పులి అడుగుల నమూనాలను సేకరించారు. ఒడిశా, ఆంధ్రాలకు చెందిన అటవీ శాఖ అధికారులు ఈ మేరకు దీనిపై స్పందించి, సంయుక్తంగా అడవుల్లో నిఘా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ రేంజర్ పాఢి పేర్కొన్నారు.

పులి అడుగులు