
రారవే రచించిన పుస్తకాలు
రాజాం: సాహిత్యం, సమాజం రెండు కళ్లు అనే మూలసూత్రంతో జనవరి 25, 2015లో రాజాం రచయితల వేదిక (రారవే) ఆవిర్భవించింది. రాజాంకు చెందిన రిటైర్డ్ హెచ్‌ఎం గార రంగనాథం, మరికొందరు కవులతో కలిసి ఏర్పాటుచేసిన రారవే తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రతినెలా చివరి ఆదివారం ఒక సాహిత్య సమావేశం చొప్పున అనతి కాలంలోనే 107 సమావేశాలు పూర్తిచేసుకుని ఆదివారం (28వ తేదీ) 108వ సమావేశానికి సిద్ధమైంది. రాజాం పట్టణంలోని జేజే ఇనోటెల్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ, రారవే సంయుక్తంగా అబ్బూరి వరద రాజేశ్వరరావు పేరుతో సాహిత్య సదస్సు నిర్వహిస్తుంది. ఈ సమావేశాన్ని రాష్ట్ర నలుమూలలుకు చెందిన సాహితీవేత్తలతో పాటు అకాడమీ తెలుగు కన్వీనర్ సి.మృణాళిని, తెలుగు సలహా మండలి సభ్యుడు చింతకింది శ్రీనివాసరావు తదితరులు పాల్గొననున్నారు.
ఉన్నతంగా రాణిస్తున్న రారవే కవులు
రారవే సభ్యులు తమ రచనలతో పేరుసంపాదిస్తున్నారు. రారవే నిర్వాహకుడు గార రంగనాథం వ్యాసాలు, కవితలు రాస్తుండగా, పిల్లా తిరుపతిరావు వ్యాసాలు, డాక్టర్ ఆల్తి మోహనరావు, పొదిలాపు శ్రీనివాసరావు వ్యాసకర్తలు, కథకులుగా రాణిస్తునఆనరు. కుదమ తిరుమలరావు, ఉరిటి గున్నేశ్వరరావు, పోలాకి ఈశ్వరరావు, కవితలు రాస్తూ మెప్పు పొందుతున్నారు. పద్య రచనలో గురుగుబెల్లి జగన్నాథరావు, ఒమ్మి రమణమూర్తి, కవితా రచనలో గార రంగనాథం, కుదమ తిరుమలరావు రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు. రారవే వరుసగా మూడేళ్లపాటు గెడ్డాపు అప్పలస్వామి నందనందనం, వెంకటరావు పరిమళభావ తరంగాలు, గార రంగనాథం తరంగధ్వానాలు పుస్తకాలు ప్రచురితమయ్యాయి.
నేడు రాజాంరచయితల వేదిక
వార్షికోత్సవం
సాహిత్యకారులతో చర్చాగోష్టికి ఏర్పాట్లు
2015లో ఏర్పడిన రారవే

Comments
Please login to add a commentAdd a comment