రాయగడ: రక్తదాన శిబిరంలో పాల్గొన్న అతిథులు
పర్లాకిమిడి: స్థానిక బిజూ కల్యాణ మండపంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి మంగళవారం ప్రారంభించారు. రక్తదానం వల్ల అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు మేలు జరుగుతుందన్నారు. శిబిరంలో 72 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో ఏడీఎం రాజేంద్ర మింజ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, జిల్లా పరిషత్ అదనపు సీడీఎం పృథ్వీరాజ్ మండల్, జిల్లా చికిత్సా అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పండా తదితరులు పాల్గొన్నారు.
రాయగడ: జాతీయ సేవ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని గుణుపూర్‌లో ఉన్న గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ) విశ్వవిద్యాలయంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం జరిగింది. ఈ శిబిరంలో 602 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. బీడీవో సుభ్రాంజలి ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో రిజిస్ట్రార్ ఎన్‌వీ జగన్నాథరావు, విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ ఏవీఎన్‌ఎల్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment