
ఈద్గాలో దువా నిర్వహిస్తున్న ప్రభుత్వ విప్ పీఆర్కే
మాచర్ల: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి తొలుత కృషి చేసింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డేనని, ఆయన బాటలోనే నడుస్తూ మైనార్టీలకు మేలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దక్కుతోందని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. శుక్రవారం 23వ వార్డులోని ఈద్గా ప్రహరీ నిర్మాణానికి రూ.32 లక్షలతో నిధులు కేటాయించి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.కోటి నిధులు మైనార్టీలకు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మాచర్ల, రెంటచింతల, కారంపూడిలో ముస్లింలకు కమ్యూనిటీ హాళ్లతోపాటు ఈద్గా అభివృద్ధికి రూ.30 లక్షల సొంత నిధులు ఖర్చు చేసినట్టు వివరించారు.
వైఎస్సార్ కుటుంబం ముస్లింలకు చేసిన మేలు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే రోజులలో ప్రతి ముస్లిం పేద కుటుంబానికీ ఇంటి స్థల పట్టా అందించి రుణాలు మంజూరు చేయించి అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని పీఆర్కే చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి, మైనార్టీ నేతలు రాష్ట్ర బ్యూటీషియన్ డైరెక్టర్ ఉప్పలపాటి జానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ జలీల్, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ కామనబోయిన కోటయ్య, శ్రీనివాసశర్మ, కౌన్సిలర్లు మురళి, షేక్ సుభాని, దస్తగిరి, షేక్ కరిముల్లా, మస్తాన్, మైనార్టీ నాయకులు షేక్ సులేమాన్ బాషా, సీలింగ్ బాషా, కణితి మస్తాన్, ట్రాక్టర్ కరిముల్లా, రెహమాన్, మున్సిపల్ కమిషనర్ రమణబాబు, ఈఈ నాగభూషణం పాల్గొన్నారు.