నరసరావుపేట: మాతృమరణాలు ఎక్కడా చోటుచేసుకోకుండా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు కృషిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జి.శోభారాణి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో మాతృ మరణాలపై ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి మాసంలో చోటుచేసుకున్న మాతృ మరణాలను కమిటీ సభ్యులు ప్రైవేటు, ప్రభుత్వ వైద్యులు, బాధితులను విచారించి మరణం సంభవించడానికి గల కారణాలను విశ్లేషించారు. తదుపరి ఇలాంటి మరణాలు ఎక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తదుపరి లింగ నిర్ధారణ చట్టం, 1994పై పోస్టరు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి, నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బీవీ.రంగారావు, జిల్లా డెప్యూటీ ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారిణి డాక్టర్ గీతాంజలి, ఐసీడీఎస్ పీడీ డాక్టర్ నాగపద్మజ, డాక్టర్లు మంత్రూ నాయక్, వసంత రాయ, హనుమకుమార్, ఆశాలు, ఏఎన్‌ఎంలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శోభారాణి
Comments
Please login to add a commentAdd a comment