ఏలేశ్వరం.. సుమనోహరం
విజయపురిసౌత్: శ్రీశైల క్షేత్రానికి ఈశాన్య ద్వారంగా మహోన్నత దేవాలయంగా ప్రసిద్ధి చెందిన నాగార్జునసాగర్ జలాశయం మధ్యన సింహాపురి కొండపై వెలసిన ఏలేశ్వరం స్వామి జాతరకు బుధవారం మహా శివరాత్రిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భారీగా తరలి వచ్చారు. ఏలేశ్వరం గట్టు హర నామస్మరణతో మారుమోగింది. అర్చకుడు శ్రీ పాద సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఏలేశ్వరస్వామి ఆలయం, అనుపులోని రంగనాథస్వామి ఆలయాల వద్ద మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేపట్టారు. ఏలేశ్వర స్వామి ఆలయంలో రాత్రి 12 గంటలకు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనుపు నుంచి ప్రత్యేక లాంచీ సర్వీసులను ఏలేశ్వరం గట్టుకు నడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుపు వద్ద విజయపురిసౌత్ ఎస్‌ఐ షేక్ మహహమ్మద్ షఫీ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీ పర్యాటక శాఖకు లాంచీల ద్వారా రూ.3.60 లక్షలు ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ మేనేజర్ అడపా శివారెడ్డి తెలిపారు. ఏలేశ్వరస్వామి ఆలయ చైర్మన్ చిన్నరామ స్వామి, లాంచీ యూనిట్ సిబ్బంది వినయతుల్లా, పులుసు వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయపురి సౌత్‌లోని లాంచీస్టేషన్ వద్ద శివాలయం, శ్రీ గంగా పార్వతీ సమేత అమరలింగేశ్వర స్వామివారి ఆలయం, భైరవుని పాడులోని కాలభైరవేశ్వర ఆలయం, శివ నాగేంద్ర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
●ఏలేశ్వరం స్వామి గట్టుకు పోటెత్తిన భక్తులు
●ఏపీ టూరిజంకు రూ.3.60 లక్షల ఆదాయం
ఏలేశ్వరం.. సుమనోహరం
ఏలేశ్వరం.. సుమనోహరం
Comments
Please login to add a commentAdd a comment