ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం
ప్రత్తిపాడు: ఆధ్యాత్మిక చింతనతో భక్తిభావం కలుగుతుందని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ అన్నారు. విశ్వంజీ జన్మదిన వేడుకల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం మండల పరిధిలోని చినకోండ్రుపాడు విశ్వనగర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య విశ్వంజీ ఔదంబర వృక్ష పీఠ సుస్థాపిత దత్త గురువులకు విశేష అర్చన చేశారు. అనంతరం యాగశాలలో వేద పండితులు శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్ట, మహాగణపతి హవనం, సుదర్శన నారసింహ, శ్రీ మహారుద్ర హవనములు, స్థాపిత దేవతా పంచోపచార పూజ, నీరాజన, మహామంత్రపుష్ప చతుర్వేద సేవలను చేశారు. తొలుత శాంతిపాఠం, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్యమేళన ప్రాశనం, రక్షాబంధనం, ఆచార్యాది ఋత్విక్ వరణం, వాస్తు, నవగ్రహ, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర, సుదర్శన నారసింహ, మహామృత్యుంజయ సప్త చిరంజీవి ఆవాహనం, అఖండధీప స్థాపన కార్యక్రమాలు వైభవోపేతంగా జరిగాయి. విశ్వమానవ సమైక్యతా సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, కామేశ్వరి దంపతులతో విశ్వంజీ ప్రత్యేక పూజలు చేయించారు. రాత్రి ఆడిటోరియంలో విశ్వణి కూచిపూడి నాట్య ప్రదర్శన, లోల మనస్వి, నిధిమల భరతనాట్య ప్రదర్శన, కౌటూరి గాయత్రి సంగీత విభావరి, ఫణికుమార్ వేణుగాన కచేరీలు అలరించాయి.
విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ
Comments
Please login to add a commentAdd a comment