గుండెపోటుతో పీఏసీఎస్ మాజీ చైర్మన్ మృతి
అచ్చంపేట: వైఎస్సార్ సీపీ నాయకులు, అచ్చంపేట పీఏసీఎస్ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ తుమ్మా చిన్నపరెడ్డి (67) గురువారం తెల్లవారుజామును 4 గంటల సమయంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన గత నెలరోజులుగా గుంటూరులో చికిత్స పొందుతూ, నాలుగు రోజుల క్రితం మెరుగైన వైద్యం కోసం వారి కుమారులు హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం 4 గంటల సమయంలో మృతి చెందారు. మండలంలో వైఎస్సార్ సీపీకి పెద్దదిక్కుగా, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు ఆత్మీయునిగా పేరుంది. 2019లో వైఎస్సార్ సీపీకి మెజార్టీ రావడానికి ప్రధాన పాత్ర పోషించారు. చిన్నపరెడ్డి కన్నుమూసిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, వారి సతీమణి వసంతకుమారి, వారి తనయుడు కళ్యాణ్‌బాబులు చిన్నపరెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు. పార్టీకి పెద్దదిక్కును కోల్పోవడం చాలాబాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ, నాయకులు, అభిమానులు అచ్చంపేట నుంచి స్వగ్రామమైన తాళ్లచెరువు వరకు భారీ ఉరేగింపు, బైక్‌ర్యాలీతో అంత్యక్రియల్లో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. జెడ్పీటీసీ సభ్యులు తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ చిల్కా చంద్రయ్య, ఎంపీపీ గంగసానిబాబు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ సీహెచ్ ఎస్సార్కే సాయిరెడ్డి, వ్యవసాయ యూనివర్సిటీ మజీ డైరెక్టర్ నెల్లూరి చంద్రబాబు, అచ్చంపేట సర్పంచ్ షేక్ జాని, మాజీ సర్పంచ్ కంబాల వీరబాబు తదితరులు మృతదేహాన్ని సందర్శించి తమ గ్రాఢ సంతాపాన్ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment