ప్రకృతి సాగుతో రైతులకు లాభం
పెదకూరపాడు: ప్రకృతి వ్యవసాయ విధానంలో మిరప పంట సాగు చేస్తూ అంతర పంటలు వేయటం వల్ల లబ్ధి కలుగుతుందని పల్నాడు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కే అమలకుమారి రైతులకు సూచించారు. గురువారం పెదకూరపాడు మండలం లింగంగుంట గ్రామంలో రాష్ట్ర పరిశోధన బృందం మిరప పంట పొలాలను పరిశీలించింది. ప్రకృతి సాగు, ఆదాయం, ఖర్చుల వివరాలను సభ్యులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె.అమలకుమారి మాట్లాడారు. మిరప వేసే ముందు 31 రకాల విత్తనాలను బీజామృతం విత్తన శుద్ధి చేసి పొలంలో చల్లి 45 రోజుల అనంతరం కలయ దున్నటం వలన ప్రయోజనం కలుగుతుందని రైతులు వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో సాగవుతున్న మిరప మొక్కలలో వ్యాధి నిరోధక శక్తి 20 నుంచి 23కు పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతి వ్యవసాయం చేయాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో పరిశోధన బృందం సభ్యులు హిమ బిందు, లీలావాణి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మధుబాబు, అమూల్య, ఉదయలక్ష్మి, జోత్స్న, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment