తాడేపల్లి రూరల్: మంగళగిరి నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వెళ్లే పాత జాతీయ రహదారిపై పాత పెట్రోల్ బంక్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్న విజయవాడకు చెందిన విద్యార్థి స్నేహితుడితో కలసి బ్యారేజ్ నుంచి ఉండవల్లి సెంటర్ మీదుగా ద్విచక్ర వాహనంపై వస్తున్నాడు. పాత జాతీయ రహదారిపై పోలకంపాడు లారీ స్టాండ్ వద్ద ఎదురుగా వస్తున్న అగ్నిమాపక వాహనాన్ని రాంగ్‌రూట్‌లో వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం ముందు టైర్ ఊడిపోయి నుజ్జునుజ్జయింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు విద్యార్థుల్లో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డాడు. స్వల్పంగా గాయపడిన విద్యార్థిని ప్రైవేటు వాహనంలో విజయవాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
నుజ్జు నుజ్జయిన ద్విచక్ర వాహనం
స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment