గుర్తుతెలియని యువకుడు మృతి
చీరాల: మున్సిపల్ కార్యాలయం ఎదుట గల కాలువ వద్ద గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గురువారం రాత్రి గుర్తించారు. ప్రమాద వశాత్తు మరణించాడా.. లేక ఇతర కారణాలా అని తెలియాల్సి ఉంది. అయితే మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించలేదు. పోలీసుల దర్యాప్తులో పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.
అడ్డంగా బుక్కయ్యాడు
మార్టూరు: ఓ ఇంట్లో చోరీకి పాల్పడుతూ ఇంటి యజమానులకు అడ్డంగా దొరికిపోయిన దొంగ ఉదంతం గురువారం సాయంత్రం మార్టూరులో జరిగింది. బాధిత కుటుంబం వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక మద్ది సీతాదేవి కాలనీకి చెందిన దంపతులు పచ్చవ శరణ్య, వెంకటేశ్వర్లు గురువారం మధ్యాహ్నం పనిపై బయటకు వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతాల్లో ఇంటికి వచ్చిన శరణ్య తమ ఇంట్లో ఎవరో ఉన్నట్లు గుర్తించి స్థానికులను అప్రమత్తం చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు తెరిచి చూడగా 50 సంవత్సరాల వయసు గల అపరిచిత వ్యక్తి ఇంటి లోపల కనిపించాడు. బీరువా లోపల ఉండాల్సిన సుమారు రూ.5 లక్షల విలువైన 70 గ్రాముల బంగారు ఆభరణాలు అతని చేతిలో ఉండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని నిందితుడిని స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆరవ పటాలంలో
శివరాత్రి వేడుకలు
మంగళగిరి: నగర పరిధిలోని 6వ బెటాలియన్‌లో గురువారం మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ కె. నగేష్‌బాబు దంపతులు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహంచారు. బెటాలియన్ అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం భక్తులకు కమాండెంట్ అన్నదానం చేశారు. కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ డి. ఆశ్వీర్వాదం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చోరీకి పాల్పడుతూ దొరికిన దొంగ
రూ.5 లక్షల విలువైన
బంగారు ఆభరణాలు స్వాధీనం
గుర్తుతెలియని యువకుడు మృతి
Comments
Please login to add a commentAdd a comment