‘పెద్దల’ ఎన్నికపై
● బెదిరింపులు.. ప్రలోభాలు
● ప్రజాస్వామ్యానికి కూటమి తూట్లు
● పీడీఎఫ్ సానుభూతిపరులను పోలింగ్
కేంద్రాలకు రాకుండా బెదిరింపులు
● బెల్లంకొండ, వెల్దుర్తి, మాచర్లలో
పీడీఎఫ్ ఏజెంట్లు రాకుండా
అడ్డుకున్న టీడీపీ నేతలు
● విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేసిన
కూటమి కార్యకర్తలు
● దొంగ ఓట్లు అడ్డుకున్నందుకు
పిడుగురాళ్ల పీడీఎఫ్ ఏజెంట్ పై
దాడికి యత్నం
● కూటమి నేతలు రిగ్గింగ్ చేస్తూ
ఎన్నికలను అపవిత్రం చేశారన్న
మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
● ఎన్నికల్లో గెలవడానికి ప్రభుత్వం
బరితెగించిందన్న వామపక్షాలు
సాక్షి, నరసరావుపేట: పట్టభద్రుల కోటాలో పెద్దల సభకు జరిగిన ఎన్నికల్లో కూటమి నేతలు అరాచకంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. కృష్ణా – గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగ్గా, పల్నాడు జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు బరితెగించారు. పోటీలో 25 మంది ఉన్నప్పట్టికీ ప్రధానంగా పోటీ పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజాల మధ్య జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలవడం కోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ముఖ్యంగా గ్రూప్–2, డీఎస్సీ లాంటి ఉద్యోగ నియామకాల వ్యవహారం, నిరుద్యోగ భృతి, యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన, జాబ్ క్యాలెండర్, ఉద్యోగుల డిమాండ్‌ల పరిష్కారం లాంటి ఎన్నికల హామీలను ఏవీ అమలు చేయకపోవడంతో పట్టభద్రులు కూటమి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఆ ప్రభావంతో కూటమి అభ్యర్థి ఓడిపోతున్నాడని గ్రహించిన ఆపార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. గతంలో ఎన్నడూ రాజకీయాలకు అతీతంగా జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఈదఫా కూటమి నేతలు బరితెగించారు.
కూటమి అక్రమాలు కొన్ని...
● బెల్లంకొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కూటమి నేతల అక్రమాలను ప్రశ్నించిన సీపీఎం మండల కార్యదర్శి చిన్నం పుల్లారావుపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా ఆయనపైనే పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చారు.
● వెల్దుర్తి మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటుచేసిన 331 పోలింగ్ కేంద్రంలో పీడీఎఫ్ ఏజెంట్లను కూటమి నేతలు బయటకు నెట్టేశారు. దీంతో ఓటింగ్ రాని ఓట్లను సైతం టీడీపీ నేతలే రిగ్గింగ్ చేశారు. ఇదే విధంగా మాచర్ల నియోజకవర్గంలో సైతం ఏజెంట్లను ఉండనివ్వలేదు. ఒకవేళ ఉండనిచ్చినా నోరు మెదపనివ్వకపోవడంతో మిన్నుకుండిపోయారు.
● చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే పుల్లారావు పోలింగ్ కేంద్రాలలో హల్‌చల్ చేశారు. అన్ని కేంద్రాలను పదే పదే తిరుగుతూ ఏజెంట్లను భయాందోళనకు గురిచేసి తన అనుచరుల చేత రిగ్గింగ్ చేయించారు. రిగ్గింగ్ ఆపండి అన్నందుకు పీడీఎఫ్ ఏజెంట్ పేరుబోయిన వెంకటేశ్వర్లను బలవంతంగా బయటకు నెట్టి దాడిచేశారు.
● అమరావతి మండలంలోని పోలింగ్ బూత్ నెంబర్ 339లో కూటమి నాయకులు దొంగ ఓట్లు పాల్పడుతున్నాన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుతో కూటమి నేతలు వాగ్వివాదానికి దిగారు. దీంతో తాను ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని లక్ష్మణరావు తెలిపారు.
● రొంపిచర్లలో టీడీపీ నాయకులు వందకు పైగా దొంగ ఓట్లు వేశారని పీడీఎఫ్ ఏజెంట్లు ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
● పిడుగురాళ్లలో మధ్యాహ్నం తరువాత కూటమి నేతలు దొంగ ఓట్లు వేయడం ప్రారంభించారు. దీన్ని పీడీఎఫ్ ఏజెంట్లు అడ్డుకోవడంతో కూటమి నేతలు పెద్దసంఖ్యలో వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకులతో గొడవకు దిగారు.
జిల్లాలో పోలింగ్ శాతం 77.33
నరసరావుపేట: కృష్ణా– గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 77.33శాతం పోలింగ్ జరిగినట్లు కలెక్టర్ పి.అరుణ్‌బాబు గురువారం సాయంత్రం వెల్లడించారు. మొత్తం ఓటర్లు 56,964మందికాగా, వారిలో పురుషులు 30,643, మహిళలు 13,640మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
‘పట్టభద్రుల’ పోలింగ్‌లో బరితెగించిన టీడీపీ నేతలు
‘పెద్దల’ ఎన్నికపై
‘పెద్దల’ ఎన్నికపై
Comments
Please login to add a commentAdd a comment