● దుకాణదారుల నుంచి అక్రమ వసూళ్లు ● రశీదు ఇచ్చి మరీ దోపి
నరసరావుపేట రూరల్: కోటప్పకొండ తిరునాళ్లలో టీడీపీ నాయకుల దందా ఆలస్యంగా వెలుగు చూసింది. తిరునాళ్లలో దుకాణాల నుంచి ఎమ్మెల్యే అనుచరులమంటూ వీరు పెద్దఎత్తున అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. తిరునాళ్ల సందర్భంగా కోటప్పకొండ జాతర జరిగే ప్రాంతంలో పెద్దఎత్తున దుకాణాలు ఏర్పాటు చేస్తారు. ప్రధాన రహదారికి ఇరువైపులతో పాటు ప్రభల వద్దకు వెళ్లే ప్రాంతంలో కూడా దుకాణాలు ఏర్పాటవుతాయి. ఈ దుకాణాల నుంచి గ్రామ పంచాయతీ కొంత రుసుము వసూళ్లు చేస్తుంది. ప్రతి ఏడాది సాధారణంగా జరిగే వ్యవహారం ఇది. వందల సంఖ్యలో ఏర్పాటయ్యే దుకాణాలు నుంచి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుంది.
ప్రైవేటు స్థలంపై పెత్తనం
కొండ దిగువున జెడ్పీ స్థలం పక్కనే మెయిన్‌రోడ్డు వెంట ప్రైవేటు స్థలం ఉంది. ఈ స్థలంలో జెయింట్‌వీల్, ఇతర ఆటల పరికరాలు వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. ప్రతి ఏడాది స్థానికంగా ఉన్నవారు స్థలయజమానితో ముందుగా ఒప్పందం చేసుకొని, కొంత లాభం చూసుకొని జెయింట్‌వీల్ నిర్వాహకులకు స్థలం అద్దెకు ఇస్తారు. టీడీపీ నాయకులు ఈ ఏడాది స్థానికులను బెదిరించి స్ధల యజమానితో ఒప్పందంచేసుకొన్నారు. గత ఏడాది కంటే రెట్టింపు అద్దెను జెయింట్‌వీల్ నిర్వాహకుల నుంచి వసూళ్లు చేశారు.
కిమ్మనని అధికారులు
దుకాణాల నుంచి ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లు చేయడంపై పంచాయతీ రాజ్ అధికారులు చర్యలకు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 23 నుంచే ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లను ప్రారంభించారు. జిల్లా పంచాయతీ అధికారి తిరునాళ్ల మూడు రోజులు కోటప్పకొండలోనే ఉండి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సమయంలో ఈ వ్యవహరం జిల్లా అధికారుల దృష్టికి వచ్చినట్టు సమాచారం. అయినా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
పంచాయతీయే వసూళ్లు చేయాలి
తిరునాళ్లలో ఏర్పాటైన దుకాణాల నుంచి పంచాయతీ సిబ్బంది వసూళ్లు చేస్తారు. ఈ సారి కూడా అలాగే సిబ్బంది వెళ్తే అప్పటికే ప్రైవేటు వ్యక్తులకు చెల్లించామని దుకాణాదారులు తెలిపారు. దీంతో మా సిబ్బంది వెనక్కి రావాల్సి వచ్చింది. ప్రైవేటు వ్యక్తుల వసూళ్లతో పంచాయతీ ఆదాయానికి గండిపడిన మాట వాస్తవం.
– భాస్కరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి
● దుకాణదారుల నుంచి అక్రమ వసూళ్లు ● రశీదు ఇచ్చి మరీ దోపి
● దుకాణదారుల నుంచి అక్రమ వసూళ్లు ● రశీదు ఇచ్చి మరీ దోపి
● దుకాణదారుల నుంచి అక్రమ వసూళ్లు ● రశీదు ఇచ్చి మరీ దోపి
Comments
Please login to add a commentAdd a comment