పెన్షన్ నగదుతో ఉడాయింపు
దాచేపల్లి: పింఛన్‌దారుల సొమ్ము తీసుకుని వార్డు సెక్రటరీ పరారైన ఘటనపై నగర పంచాయతీ అధికారులు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని వార్డు సచివాలయం–3లో వెల్ఫేర్ సెక్రటరీగా సంపతి లక్ష్మీప్రసాద్ విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు నెలల కిందట గుంటూరు నుంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. బ్యాంక్ నుంచి రూ.8.43 లక్షల పింఛన్ నగదు డ్రా చేసుకుని తన వద్ద పెట్టుకున్నాడు. ఇతను పిడుగురాళ్లలో నివాసం ఉంటున్నాడు. 200 మందికి పింఛన్ నగదు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఉదయాన్నే పింఛన్ నగదు కోసం లబ్ధిదారులు ఎదురు చూశారు. ఉదయం 11 గంటలైన పింఛన్ నగదు పంపిణీ చేసేందుకు ఎవరూ రాకపోవటంతో పింఛన్‌దారులు నగర పంచాయతీ కమిషనర్ ఎంవీ అప్పారావుకు ఫిర్యాదు చేశారు. సచివాలయం–3 వద్దకు పింఛన్‌దారులు చేరుకుని పడిగాపులు కాశారు. ఎంతసేపటికీ సెక్రటరీ రాకపోవటంతో ఆందోళన చేశారు. లక్ష్మీప్రసాద్ ఆచూకీ కోసం కమిషనర్ ప్రయత్నాలు చేశారు. అతని సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్ కావటంతో పిడుగురాళ్లలోని ఇంటికి సిబ్బందిని పంపి ఆరా తీస్తే అందుబాటులో లేడని తెలిసింది. దీంతో కమిషనర్ అప్పారావు దాచేపల్లి పోలీస్‌స్టేషన్‌లో లక్ష్మీప్రసాద్‌పై ఫిర్యాదు చేశారు. సీఐ భాస్కర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వార్డు సెక్రటరీ లక్ష్మీప్రసాద్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు కమిషనర్ అప్పారావు చెప్పారు.
రూ.8.43లక్షలతో వార్డు సెక్రటరీ పరారీ పోలీసులకు ఫిర్యాదు చేసిన కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment