ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షతో శనివారం ప్రశాంత వాతారణంలో ప్రారంభమయ్యాయి. సిద్ధంగా ఉంచిన మూడు సెట్ల ప్రశ్నపత్రాలలో సెట్–2 ప్రశ్నాపత్రాన్ని ప్రకటించారు. పరీక్షల తొలిరోజు కావటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దకు ఉదయం 8గంటలకే చేరుకున్నారు. విద్యార్థుల హాల్‌టిక్కెట్లు పరిశీలించి లోపలికి అనుమతించారు. జిల్లాలోని 48 పరీక్షా కేంద్రాలలో 18,481 మంది విద్యార్థులకు గాను 17,591మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మరో 890మంది గైర్హాజరయ్యారు. వీరిలో జనరల్ విద్యార్థులు 17,313 మందికి గాను 16,554మంది హాజరు కాగా మరో 759మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 1,168మందికి గాను 1,037మంది హాజరు కాగా మరో 131మంది గైర్హాజరయ్యారు. ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్య అధికారి ఎం.నీలావతిదేవి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు పట్టణంలోని శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష నిర్వహణ, మౌలిక వసతులను పరిశీలించి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, చీఫ్ సూపరింటెండెంట్ రాజనాల వేణుమాధవ్‌లకు పలు సూచనలు చేశారు. అలాగే జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు పట్టణంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా ఈనెల 3వతేదీ సోమవారం సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
పరీక్ష కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ అరుణ్‌బాబు తొలిరోజు 95.18 శాతం హాజరు నమోదు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
Comments
Please login to add a commentAdd a comment