అమరావతి: మండలంలోని మండెపూడి గ్రామపరిధిలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్దుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 75 త్యాళ్లూరు నుంచి గుంటూరు వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్ మండెపూడి గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న పల్లెపోగు వెంకటేశ్వరరావును ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఘటనలో పల్లెపోగు వెంకటేశ్వరరావు (70) అక్కడికక్కడే మరణించాడు. అమరావతి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహన్ని పోష్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన అర్టీసీ బస్‌ను అమరావతి పోలీస్‌ష్టేషన్‌కు తరలించారు.
పది విద్యార్థుల సందేహాల నివృత్తి
డీఈఓ కార్యాలయంలో ర్యాంక్ సాధన కార్యక్రమం
నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా జిల్లా విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 17 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ ఆధ్వర్యంలో సబ్జెక్ట్ నిపుణులతో ర్యాంక్ సాధన కార్యక్రమం నిర్వహించారు. డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ వెబ్ బాక్స్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యార్థుల సందేహాలకు సబ్జెక్ట్ నిపుణులు సమాధానాలిచ్చారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా డీఈఓ చంద్రకళ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 500 మార్కులకుపైబడి వచ్చే విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించే దిశగా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
యడ్లపాడు విద్యార్థిని ప్రతిభకు రాష్ట్రస్థాయి గౌరవం
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నోస్కూల్ –2 బ్రాంచ్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థిని రావిపాటి ఉషశ్రీ, ఆమె బృందం రూపొందించిన నాసా ప్రాజెక్ట్ రాష్ట్రస్థాయిలో ఎంపికై ంది. యడ్లపాడు గ్రామానికి చెందిన ఉషశ్రీ అద్భుతమైన నైపుణ్యంతో చేసిన ఈ ప్రాజెక్ట్‌కు విశేషమైన గుర్తింపు లభించడంతో, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఉషశ్రీతోపాటు బృందసభ్యుల్ని శనివారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ ‘మన ప్రాంతం నుండి ఇటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులు వెలుగులోకి రావడం గర్వించదగిన విషయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment