రేపు, ఎల్లుండి పల్నాటి వెంకన్న తిరునాళ్ల మహోత్సవం
గురజాల : పల్నాటి వెంకన్న క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన జంగమహేశ్వరపురం శ్రీ అలివేలు మంగా పద్మావతీ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆది, సోమవారాల్లో జరగనున్నాయి. ఈ సందర్భంగా తిరునాళ్లకు కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం స్వామికి హోమం, బలిహరణం, ఎదురుకోలు ఉత్సవం నిర్వహిస్తామని, అన్నసంతర్పణ కార్యక్రమ జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. మధ్యాహ్నం సమయంలో అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం, సాయంత్రం కోలాట ప్రదర్శన నిర్వహిస్తారని వెల్లడించారు. రాత్రికి సాసం్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందని వివరించారు. 3న హోమం, బలిహరణము, గరుడసేవ, పూర్ణాహుతి, నాగవల్లి, ఉద్వాసన, ధ్వజపట ఉద్వాసన, 4న హనుమంత్ వాహనసేవ, రథోత్సవం, వసంతసేవ నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
రేపు, ఎల్లుండి పల్నాటి వెంకన్న తిరునాళ్ల మహోత్సవం
Comments
Please login to add a commentAdd a comment